జనగణన నమోదు పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
ATP: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ 2027 జనగణన ప్రక్రియలో భాగంగా శుక్రవారం తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు జరుగుతున్న స్వీయ గణనలో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.