జిల్లాలో 80.84 శాతం పోలింగ్ నమోదు

జిల్లాలో 80.84 శాతం పోలింగ్ నమోదు

PDPL: జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80.84 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఆదివారం నిర్వహించిన పోలింగ్‌ను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకుర్తి మండలంలోని కుక్కల గూడూరు, ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, బసంత్‌నగర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.