'మైనర్‌లు డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు'
KRNL: మైనర్‌లు డ్రైవింగ్ చేయడం చట్ట ప్రకారం తీవ్ర నేరమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. 2025 జనవరి, అక్టోబర్ నెలల మధ్య జిల్లాలో 675 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులు, యాజమానులకు ఆయన సూచించారు. వాహనాలు నడిపి పట్టుబడితే రూ. 5000 జరిమానా విధిస్తామన్నారు.