ఉప్పల్ రింగురోడ్డు పనులు త్వరలో ప్రారంభం

ఉప్పల్ రింగురోడ్డు పనులు త్వరలో ప్రారంభం

మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ మందుముల పరమేశ్వర్రెడ్డి కృషితో ఉప్పల్ రింగురోడ్డు-నల్లచెరువు వరకు రహదారి పనులు అతిత్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నిర్మాణంతో ఉప్పల్‌లో వరంగల్ జాతీయ రహదారిపై వాహనదారుల, స్థానికుల కష్టాలు తీరనున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మంగళవారం రహదారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.