'మహిళలను బ్యాంకు చుట్టూ తిప్పకుండా రసీదులు ఇవ్వాలి'
SKLM: మందస వెలుగు కార్యాలయంలో ఏపీఎం పైడి కూర్మారావు ఆధ్వర్యంలో స్థానిక గ్రామీణ బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘ సభ్యులను బ్యాంకుల చుట్టూ తిప్పకుండా పొదుపులు అప్పులు కట్టించుకొని సీఎస్పీల ద్వారా రసీదులు ఇచ్చే విధానం మెరుగుపరచాలన్నారు. మహిళా సభ్యుల సమస్యలను ఏపీ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లారు.