రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

NDL: పాములపాడు మండలంలో బుధవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన సయ్యద్ నూర్ (46) పాములపాడు నుంచి వెలుగోడుకు వెళ్తుండగా, వెలుగోడు నుంచి భానుముక్కల వస్తున్న జాకీర్ బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సయ్యద్ నూర్ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన జాకీర్‌ను ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు.