రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల. బాల రామకృష్ణ జి.ఎర్రంపాలెం గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు సులభతరం చేయడంతోపాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, వెంటనే చెల్లింపులు అందేలా చేసేందుకు రైతు సేవా కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు.