న్యాయవాద సంఘం అధ్యక్షుడిగా రంగస్వామి ఎన్నిక

న్యాయవాద సంఘం అధ్యక్షుడిగా రంగస్వామి ఎన్నిక

కర్నూలు: పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా రంగస్వామి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రాముడు ప్రకటించారు. అధ్యక్ష స్థానానికి మినహ మిగిలిన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో న్యాయవాదుల ఓట్లు 97 ఉండగా 91 ఓట్లు పోలైయాయని తెలిపారు. నూతన అధ్యక్షుడికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.