వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మరథోత్సవం

వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మరథోత్సవం

సత్యసాయి: కదిరి పట్టణంలో ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న శ్రీవారి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు భారీగా తరలి వచ్చారు. రథం ముందుకు సాగుతుండగా, స్వామివారికి దవణం, మిరియాలు, కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.