'ప్రభుత్వం తరుఫున అన్ని విధాలుగా కృషి'
JN: దేవరుప్పులలో నిర్మించిన విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రాన్ని టీజీడీడీసీఎఫ్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం తరుఫున అన్ని విధాలుగా కృషి చూస్తున్నామన్నారు. పాల ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించాలన్నారు.