ఎనీమియా బాధితునికి సీఎంఆర్ఎఫ్ సహాయం

KKD: కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన ముడికి తిరుపతిరావు అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్నాడు. బాధితునికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కొండంత అండగా నిలిచి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి నుంచి రూ.5 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) అందించి బాధితునికి బాసటగా నిలిచారు. దీంతో మంత్రికి లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపారు.