స్పందన అర్జీలను పరిష్కరించండి: కలెక్టర్

అన్నమయ్య: స్పందన అర్జీలను నాణ్యతతో పరిష్కరించడం పై అధికారులు ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యను అత్యంత బాధ్యతగా పరిష్కరించాలన్నారు.