మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

కడప పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ బాబును ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు కలిసి ఎస్సీల సమస్యలపై చర్చించారు. ఎమ్మార్పీఎస్ కార్యాలయాలు ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ అధికార ప్రతినిధి మాతయ్య, వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నసుబ్బయ్, జీవన్ పాల్గొన్నారు.