కేంద్ర ప్రభుత్వం రైతు హామీలను నెరవేర్చాలి

గుంటూరు: ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ గురువారం రైతు సంఘం నాయకులు పిడుగురాళ్ల పట్టణం,బ్యాంకు సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో రైతు ఉద్యమానికి దిగివచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని.. హామీలకు ఉద్యమిస్తున్న రైతులపై పోలీసు, మిలటరీ దళాలతో దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.