చౌడేపల్లిలో 13 మందిపై కేసు నమోదు

చౌడేపల్లిలో 13 మందిపై కేసు నమోదు

CTR: చౌడేపల్లి మండలంలో విద్యుదాఘాతానికి గురై పి.సుబ్రహ్మణ్యం రెడ్డి మృతి చెందారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ తీగలు తగిలి సుబ్రహ్మణ్యం రెడ్డి మృతి చెందారని కొంతమంది ఆరోపించారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద మృతదేహంతో నడిరోడ్డుపై బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. ప్రజలను,వాహనదారులను ఇబ్బందులకు గురిచేసిన 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.