సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

SDPT: జగదేవ్‌పూర్ మండలం అలీరాజీపేట గ్రామంలో నేడు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఏనుగుల కిష్టారెడ్డి, తిప్పబత్తిని బాలయ్యలకు మంజూరైన చెక్కులను నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచమల్ల ఎల్లేష్, నిర్మల్ నగర్ మాజీ సర్పంచ్ కర్రె రాజు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.