VIDEO: బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం నీలిగిరిస్వామి తండాకు చెందిన బానోత్ రమణ(25) వర్ధన్నపేట నుంచి తండాకు వెళ్తుండగా బైక్‌ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు