నేడు ఎంపీ కలిశెట్టి ఆధ్వర్యంలో ప్రజాగ్రీవెన్స్

SKLM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు చిలకపాలెంలోని ఓ కళ్యాణ మండపంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించినట్లు మంగళవారం ఎంపీ క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నాయకుల సమావేశం ఉంటుందన్నారు.