వంద శాతం ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ మహేష్
కోనసీమ: జిల్లాలో మార్చి 16 నుండి ప్రారంభం కానున్న 10th పరీక్షలపై కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న '100 రోజుల ప్రణాళిక' ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులను 'షైనింగ్', 'రైజింగ్' స్టార్లుగా విభజించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.