మూసీ రివర్ ప్రాజెక్ట్‌కు రూ.375 కోట్లు

మూసీ రివర్ ప్రాజెక్ట్‌కు రూ.375 కోట్లు

TG: మూసీ రివర్ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.375 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లోని నిర్మాణాలను సగం వరకు తొలగించారు. ప్రస్తుతం, మూసీ నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్నారు. ఈ నిధుల విడుదలతో మూసీ ప్రక్షాళన మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.