VIDEO: ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణపై రైతుల ఆందోళన
WGL: వర్ధన్నపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూసేకరణపై సోమవారం రైతులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదుట తమ గోడు వెళ్లిపోసుకున్నారు. తమ జీవనాధారం అయిన భూమిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి, బాధిత రైతులకు న్యాయం చేస్తామని, ప్లాట్లు అందిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో రైతులు తమ పిల్లల భవిష్యతు ఆగమవుతుందని తెలిపారు.