అక్క బాగున్నావా.. ఓటేసి నన్ను గెలిపించండి..!
MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్ధం సునీత వీరారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి గడపగడపకు వెళ్లి అక్క బాగున్నావా.. అని ఆప్యాయంగా పలకరించి ఓటు వేసి నన్ను గెలిపించాలని అభ్యర్థించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ముద్ధం నిర్మల మహబూబ్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు.