వరిగడ్డి కోసం రైతుల అవస్థలు

వరిగడ్డి కోసం రైతుల అవస్థలు

నెల్లూరు: ఆత్మకూరు ఏరియాలో వరిగడ్డికి డిమాండ్ ఏర్పడింది. గతంలో వరి కోతల సమయంలో ఎకరాకు 40, 50 కట్టల గడ్డి లభించేది. ప్రస్తుతం మిషన్ కటింగ్‌తో 20-25 మించి రావడం లేదు. గడ్డి కొరతతో ఇతర గ్రామాలకు వెళ్లి రైతులు కొనుగోలు చేస్తున్నారు. పశువులు కలిగిన వారు దూర ప్రాంతాల నుంచి ఎకరా గడ్డిని రూ.1500లకు కొనుగోలు చేసి ఇళ్లకు తెచ్చుకుంటున్నారు.