కార్పొరేషన్ లోన్లు వెంటనే మంజూరు చేయాలని వినతి
సత్యసాయి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ లోన్లు వెంటనే మంజూరు చేయాలని ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షుడు దాసగానిపల్లి కుళ్లాయప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ భరద్వాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రతి గ్రామంలో కనీసం 10 మందికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.