ఎమ్మెల్యే నసీర్ అబద్ధాలు చెప్పి గెలిచారు: నూరి ఫాతిమా
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అబద్ధాలు చెప్పి గెలిచారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా విమర్శించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు భూములపై ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నిబంధనల ప్రకారం నగదు చెల్లించామని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.