మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
PLD: పిడుగురాళ్ల సివిల్ జడ్జి కోర్టులో మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. ఈ మేరకు న్యాయమూర్తి ప్రవళిక బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, ఎక్సైజ్, ప్రీ-లిటిగేషన్ కేసులను ఇక్కడ పరిష్కరించుకోవచ్చని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు కక్షిదారులకు సమయం ఆదా అవుతుందన్నారు.