రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా పోలీసుల హవా

రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా పోలీసుల హవా

KMR: పోలీస్ కమిషనరేట్ వేదికగా జరిగిన తెలంగాణ 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. టేబుల్ టెన్నిస్‌లో పీసీ తిరుపతి రజతం సాధించగా.. ఆర్చరీ, పవర్ లిఫ్టింగ్, రెజ్లింగ్, సైక్లింగ్, కబడ్డీ విభాగాల్లో 10 కాంస్య పతకాలు వరించాయి. మొత్తం 11 పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నిన్న అభినందించి, పతకాలు అందజేశారు.