VIDEO: లవ్ మ్యారేజ్.. తల్లి ఆత్మహత్యాయత్నం

VIDEO: లవ్ మ్యారేజ్.. తల్లి ఆత్మహత్యాయత్నం

SRD: పటాన్ చెరు మండలంలోని రుద్రారంలో వసంత అనే మహిళ బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన పెద్ద కుమారుడు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడనే బాధతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్లోర్ క్లీనర్ తాగింది. ఇది గమనించిన స్థానికులు భర్త రమేష్‌కు సమాచారం అందించి, ఆమెను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు.