చేనేత కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ.
SKLM: జి. సిగడాం మండలం దేవరవలస గ్రామానికి చెందిన చేనేత కార్మికులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన నిత్యవసర సరుకులు బుధవారం అందజేశారు. 50kgల బియ్యం కేజీ కందిపప్పు కేజీ బంగాళదుంపలు కేజీ చింతపండు అందజేశారు. స్థానిక సర్పంచ్ వెంకట్రావు, మధుపాం సర్పంచ్ భోగాది అప్పలనాయుడు, మండల టిడిపి అధ్యక్షుడు కుమరాపు రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారులు అందజేశారు.