గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
SRCL: భారీ వర్షాలు కొయ్యడంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్, అనంతగిరి, సిరికొండ గ్రామాల మధ్య వాగు పొర్లడంతో పెద్ద లింగాపూర్, అనంతగిరి, సిరికొండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లి చెరువు కట్టలు తెగిపోయాయి.