ఉల్లాసంగా 'హ్యాపీ సండే'
SRD: తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలనా ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో 'హ్యాపీ సండే' కార్యక్రమం ఉల్లాసంగా జరిగింది. వారానికి 6 రోజులు తీరిక లేకుండా పని చేసిన ప్రజలకు ఆదివారం ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించేందుకు పురపాలక సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. యోగా, డాన్స్ వ్యాయామాలు, కరాటే సెషన్లతో పార్కులో ఒక ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంది.