యుద్ధాల్లో ఓటమి ఎరుగని వీరుడు శంభాజీ

మరాఠా ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ జయంతి నేడు. 1657 మే14న పురందర్ కోటాలో ఆయన జన్మించారు. 1681 నుంచి 1689 వరకు మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతిగా పాలించారు. తండ్రి మరణానంతరం ఆయన సింహాసనాన్ని అధిష్టించారు. మొఘలులను శంభాజీ ముప్పుతిప్పలు పెట్టారు. 120 యుద్ధాలు చేసిన ఆయన.. అన్నింటిలోనూ విజయం సాధించారు. ధర్మం కోసం ప్రాణాలర్పించిన శంభాజీ త్యాగం చిరస్మరణీయం.