నేడు కనిగిరిలో ప్రజాదర్బార్

నేడు కనిగిరిలో ప్రజాదర్బార్

ప్రకాశం: కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు ఇవాళ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా దర్బార్ కొనసాగుతుందన్నారు. సమస్యలపై అర్జీలు ఇచ్చేవారు వారి అర్జీపై ఆధార్ కార్డు నంబర్, సచివాలయం పేరు రాసి, అర్జీని మరో జిరాక్స్ కాపీ తీసుకురావాలన్నారు.