15 ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా: లక్ష్మీశా

15 ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా: లక్ష్మీశా

NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రత్యేక వైద్యులతో 24 గంటల పాటు వైద్య శిబిరం కొనసాగుతుందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ముందు జాగ్రత్తగా పైప్‌లైన్‌ల ద్వారా తాగునీటి సరఫరా నిలిపివేసి, 15 ట్యాంకర్‌ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. దీనిపై ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (9154970454) ఏర్పాటు చేశామన్నారు.