నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ: డీఐఈవో
WNP: ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నట్లు శనివారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య తెలిపారు. లేట్ ఫీజు లేకుండా ఈనెల 14 వరకు చెల్లించవచ్చని అన్నారు. రూ.100 ఫైన్తో ఈనెల 16 నుంచి 24 వరకు, రూ. 500తో ఈనెల 26 నుంచి DEC 1 వరకు, రూ. 2వేల జరిమానాతో DEC 10 నుంచి 15 వరకు స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు.