రామనగరం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం
KMM: సత్తుపల్లి మండలం రామానగరం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఒంటెద్దు వెంకటమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో సహకరించిన అన్ని పార్టీల నాయకులు, ప్రజలకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివ వేణు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెంకటమ్మ పేర్కొన్నారు.