VIDEO: నిప్పుల గుండం తొక్కిన భక్తులు..!
ELR: బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలోని గద్దె రాజుల అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏ ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేశారు. ఈ నిప్పుల గుండంపై భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అలాగే ఈరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.