విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
JGL: వివిధ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ ఆర్టిజన్, అమ్మ్యాన్ ఉద్యోగులు బుధవారం నిరవధిక సమ్మె చేపట్టారు. జగిత్యాల డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, విద్యార్హతలను బట్టి కేటగిరీ మార్పు, 2026 పీఆర్సీ అమలు, కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.