'ఉపాధి సిబ్బంది బాధ్యతగా పనిచేయాలి'

ప్రకాశం: ఉపాధి సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలని ఏపీవో శ్రీనివాస నాయక్ తెలిపారు. గురువారం చంద్రశేఖరపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రివ్యూ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఇంత వరకు ఏఏ పనులు పూర్తి చేశారనే దానిపై ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు పనులు కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు.