శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసిన దంపతులు
NDL: శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి బీసీ ఇందిరమ్మ కలిసి పర్యటించారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.