కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
NLR: ప్రజల సొత్తు అయిన మెడికల్ కళాశాలను ప్రైవేట్పరం చేస్తూ ప్రభుత్వం అమ్మేస్తుందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు. మనుబోలు మండలం కొలనులను గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు తీసుకొచ్చి వాటిలో కొన్నిటిని పూర్తి చేశారన్నారు.