అల్లవరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

అల్లవరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

కోనసీమ: అల్లవరం పోలీస్ స్టేషన్‌‌ను అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులను పరిశీలించి, రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.