500 కుటుంబాలకు కర్రల వంతెనే ఆధారం
AP: అనకాపల్లి, అల్లూరి జిల్లాల సరిహద్దులో అర్జాపురం, మునగల పాలెం గ్రామాల్లో సుమారు 500 కుటుంబాలు ఉంటున్నాయి. వీరు బయటకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. అయితే ఆ వాగుపై వంతెన నిర్మించాలని కొన్నేళ్లుగా అర్జీలు పెట్టినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో వాగుపై చెట్టు ఆధారంగా చేసుకుని కట్టెలతో వారు వంతెన నిర్మించుకున్నారు. కాగా, ఎమర్జెన్సీలో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు.