గ్యాస్ ఏజెన్సీ తనిఖీ

గ్యాస్ ఏజెన్సీ తనిఖీ

VSP: విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి మెస్సర్స్ ప్రతిభ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి, సహాయ సరఫరా అధికారి సిబ్బందితో కలిసి రికార్డులను పరిశీలించారు. డొమెస్టిక్, నాన్-డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాపై బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ సందీప్‌తో చర్చించి, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.