జనరల్ స్థానాల్లో బీసీల హవా

జనరల్ స్థానాల్లో బీసీల హవా

SRCL: చందుర్తి మండలంలో జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థుల హవా కొనసాగింది. 19 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 9 జనరల్ స్థానాల్లో 24 మంది బీసీలు పోటీ చేయగా బీసీలు 8 గెలిచారు. ఓసీలు ఏడుగురు పోటీ చేయగా ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. ఎస్సీలు రెండు జనరల్ స్థానంలో పోటీ చేయగా ఒక స్థానంలో గెలుపొందారు.