VIDEO: భారీ కొండ చిలువ కలకలం.. వణికిపోతున్న జనం
కోనసీమ: ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో భారీ కొండ చిలువ కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున 16 అడుగుల భారీ కొండ చిలువను స్థానికులు గుర్తించారు. స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించగా, ఆయన అక్కడకు చేరుకుని అటవీశాఖ సిబ్బంది సహకారంతో పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత పెద్ద భారీ పాము ఎప్పుడూ చూడలేదని గ్రామస్తులు అంటున్నారు.