సినిమా ఛాన్స్ కోసం వచ్చి.. గుండెపోటుతో మృతి

సినిమా ఛాన్స్ కోసం వచ్చి.. గుండెపోటుతో మృతి

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన వాడపల్లి సంజయ్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. సినిమాలపై ఆసక్తితో అవకాశాల కోసం తరచూ హైదరాబాద్‌కు వచ్చేవాడు. గత నెల 14న నగరానికి వచ్చిన సంజయ్ బుధవారం బంజారాహిల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థ కార్యాలయానికి వెళ్లాడు. ఆడిషన్స్ ముగిశాయని చెప్పడంతో అక్కడే కూర్చున్న అతడు అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందాడు.