అలర్ట్.. జిల్లాలో భారీ వర్షాలు

WGL: నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. 'వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.