వెండి శంఖం బహుకరణ

ELR: భీమవరం వీరమ్మ పార్క్ సమీపంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత బోగలింగేశ్వర స్వామి ఆలయానికి పట్టణానికి చెందిన పరిపాటి శ్రీనివాస్, రత్నకుమారి దంపతులు దక్షిణావృత అభిషేక వెండి శంఖాన్ని అందజేశారు. శంఖాన్ని అర్చక బ్రహ్మ కొత్తపల్లి సూర్య ప్రకాశ్ (లాలు) చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాటి వెంకట పుల్లారావు, నీల కుమారి, సత్య నారాయణమూర్తి, పరిపాటి మణికంఠ పాల్గొన్నారు.