VIDEO: 'న్యాయం చేసి భూములు తిరిగి ఇవ్వాలి'
మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి చెందిన రైతులు తమ భూములను అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సర్వే నెం. 3/5లోని రెండు ఎకరాల 25 సెంట్ల భూమిని సర్పంచ్ రమణారెడ్డి ఆన్లైన్‌లో అక్రమంగా మార్చించుకున్నాడని, ప్రాణహానీ బెదిరింపులు ఇస్తున్నాడని తెలిపారు. న్యాయం చేసి భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.